Breaking News

కూతురికి జన్మనిచ్చిన తెలుగు సింగర్.. ఆశీర్వదించిన కీరవాణి

Published on Fri, 09/26/2025 - 21:15

టాలీవుడ్‌లో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న లిప్సిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చిన విషయాన్ని బయటపెట్టింది. ఊయల వేడుకని ఘనంగా చేసుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. తోటి సింగర్స్, నెటిజన్లు ఈమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ వేడుకకు వచ్చిన కీరవాణి.. పాపని ఆశీర్వదించారు.

(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. అప్పు చేసి రూ.4.75 కోట్లు తిరిగిచ్చా: హీరో సిద్ధు)

ఎంబీఏ చేసిన లిప్సిక.. చిన్నతనంలోనే పలు షోల్లో పాల్గొంది. గాయనిగా కెరీర్ ప్రారంభించింది. ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమకథా చిత్రమ్, బింబిసార, టెంపర్, బాహుబలి తదితర చిత్రాల్లో పాటలు పాడింది. ఓవైపు గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెబుతోంది.  'మేం వయసుకు వచ్చాం' మూవీతో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. హెబ్బా పటేల్‌, మెహరీన్‌, మేఘా ఆకాశ్‌ తదితర హీరోయిన్లకు ఈమెనే వాయిస్ ఇచ్చింది.

2012లో ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పుడప్పుడు భర్తతో తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేసే లిపిక్స.. ఇప్పుడు తనకు కూతురు పుట్టిన విషయాన్ని రివీల్ చేసింది. ఈ కార్యక్రమానికి కీరవాణి వచ్చారు. ఈయన దగ్గర చాన్నాళ్ల నుంచి లిప్సిక.. శిష్యరికం చేస్తోంది. ఈయన ఆశీర్వదించిన విజువల్స్ కూడా వీడియోలో ఉన్నాయి. అలానే బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు కూడా లిప్సిక కూతురి ఊయల వేడుకకు వచ్చింది.

(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)