Breaking News

అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్‌..!

Published on Sun, 07/17/2022 - 20:27

Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్‌ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్‌ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రధానంగా కొవిడ్‌ తర్వాత థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్‌లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్‌ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

చదవండి: బ్యాడ్ న్యూస్‌ చెప్పిన నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. వీడియో వైరల్‌
స్టార్ హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌

ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)