Breaking News

నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

Published on Wed, 08/27/2025 - 21:13

రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మూవీ మేకర్స్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ట్రైలర్‌ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా  దామోదర్ ప్రసాద్  మాట్లాడుతూ... "ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా  ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్‌పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.

చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ సార్‌కు కృతజ్ఞతలు. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్" అన్నారు. దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ... "మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ సార్‌కు మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు" అన్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఒక వ్యక్తి మొహమాటంతో తన ఉద్యోగాన్ని.. అలాగే తన జీవితంలోకి వచ్చిన ఉన్నత అధికారితో ఎలా మసులుకుంటాడు అనేది ఎంతో ఫన్నీగా ఉండనుందని అర్థమవుతోంది. అతని క్యారెక్టర్ చూస్తే ఎంతోమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా.. అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)