Breaking News

టాలీవుడ్‌ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్.. బాబు మోహన్ సందడి

Published on Mon, 12/08/2025 - 13:35

క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఈ మూవీకి వెంకట్ త్రినాథ రెడ్డి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు బాబు మోహన్ హాజరయ్యారు.

బాబు మోహన్ మాట్లాడుతూ... 'అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నా' అని అన్నారు.

దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి  మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నిర్మాతలు నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ సినిమాను పూర్తి చేశాం. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. నా తొలి చిత్రానికి ఇంతగా సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హీరో అవి తేజ్ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో నటించారు. ఈ సినిమా చూసి మీరు ఫీల్ గుడ్ అవుతారని హామీ ఇవ్వగలను. ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా" అని అన్నారు. 
డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాత కుమార్ అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్ కీలక పాత్రల్లో నటించారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)