Breaking News

'కల్లు మత్తు కాదు కదా సార్.. తాగింది దిగడానికి..' ఆసక్తిగా దండోరా ట్రైలర్‌

Published on Fri, 12/19/2025 - 21:22

బిందుమాధవి, నవదీప్‌ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా.  ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  స‌మాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లకు రానుంది.

మూవీ రిలీజ్‌ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్‌ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)