Breaking News

ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్‌ థ్రిల్లర్.. ఏకంగా టాప్‌-3లో ట్రెండింగ్‌!

Published on Tue, 09/02/2025 - 20:59

కంటెంట్ బాగుంటే చాలు సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్‌. మరికొన్ని చిత్రాలేమో థియేటర్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే.. ఓటీటీలో ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఫుల్ డిమాండ్‌ ఉంటోంది. ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు డిజిటల్‌గా దూసుకెళ్తున్నాయి. ఇటీవల ఆర్‌కే సాగర్, మిషా నారంగ్‌ జోడీగా నటించిన టాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ ది 100. ఈ మూవీలో ధన్యా బాలకృష్ణ కీలకపాత్రలో నటించింది. జూలై 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోలీస్‌ థ్రిల్లర్‌ మూవీకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఇండియా వ్యాప్తంగా టాప్-3లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్కే సాగర్‌ ఐపీఎల్‌ అధికారి విక్రాంత్ పాత్రలో మెప్పించారు.

ఈ విషయాన్ని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా సినిమా ది 100 అమెజాన్ ప్రైమ్‌లో భారతదేశంలో టాప్ -3లో ట్రెండింగ్‌ అవుతోంది. మా సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, ప్రోత్సాహమే ఈ ఘనతకు కారణమని సంతోషం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)