మహేశ్ బాబు టైటిల్‌తో మూవీ.. హీరోగా ఎవరంటే?

Published on Tue, 12/31/2024 - 21:13

వరుణ్ రాజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పోకిరి. ఈ మూవీలో మమతా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ హీరో వరుణ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి  నా గుండె జారిపోయిందే అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.

డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. 'మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం. వేరే టైటిల్స్ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్ అవుతుందని ఫిక్స్ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకముంది' అని అన్నారు. హీరోయిన్ మమత మాట్లాడుతూ.. "ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. డైరెక్టర్ వికాస్, వరుణ్ సర్‌కు థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీనే గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా' ‍అని అన్నారు.

హీరో వరుణ్ రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడతాం. మూవీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్‌కు అభిమానిని. ఈ సినిమా టైటిల్‌ పోకిరికి ఓనర్ మహేష్ బాబు గారే. మేమంతా అభిమానులం అంతే' అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమా కి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్ మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నా. మా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకముంది' అనిఅన్నారు.
 

Videos

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)