Breaking News

ట్రైలర్‌లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ

Published on Thu, 04/03/2025 - 15:22

డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్‌తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్‌ మూవీ జాక్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్‌ ట్రైలర్‌లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.

అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్‌కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో  హీరో క్యారెక్టర్‌కు.. ఆ సమయంలో ఎమోషన్‌కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్‌కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్‌ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.

కాగా.. ఈ చిత్రంలో  సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)