పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్‌లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
Published on Sun, 01/11/2026 - 04:26
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్‌ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రవితేజ మాట్లాడారు.
రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్‌లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్‌తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్‌లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.
'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9
— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026
Tags : 1