Breaking News

నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!

Published on Fri, 07/03/2026 - 15:46

నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ అండర్‌వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్‌కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్‌తో వింటేజ్ హెయిర్ లుక్‌లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్‌తో కనిపించారు.  అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.

తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్‌ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్‌తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్‌లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.  తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)