Breaking News

టాలీవుడ్‌లో నెపోటిజం.. ఇక్కడ పనిచేయవు.. ఆ హీరోకు మంచు మనోజ్ కౌంటరిచ్చాడా!

Published on Wed, 07/09/2025 - 16:52

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం నెపోటిజం. ఈ పదం ఇటీవల సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పదానిరి అర్థం మరి సింపుల్‌గా చెప్పాలంటే.. తన కుటుంబం బ్యాక్‌గ్రౌండ్‌ అండతో స్టార్‌గా ఎదగడమే. ఒక రకంగా బంధుప్రీతి అన్నమాట. అయితే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొందరు అలానే వచ్చినప్పటికీ.. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. అయితే తాజాగా నెపోటిజంపై హీరో మంచు మనోజ్ చేసిన కామెంట్స్‌ వైరలవుతున్నాయి.

సుహాస్ హీరోగా వస్తోన్న ఓ భామ అయ్యో రామా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మంచు మనోజ్ మాట్లాడారు. యూట్యూబ్‌తో కెరీర్‌ మొదలుపెట్టి హీరో స్థాయికి చేరుకోవడం అంటే మామూలు విషయం కాదని సుహాస్‌పై ప్రశంసలు కురిపించారు. తాను కూడా నెపో కిడ్‌నే అని.. కానీ టీమ్ అంతా కష్టపడితేనే మూవీ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి మాట్లాడారు. దీనికి కౌంటర్‌గానే మంచు మనోజ్ మాట్లాడి ఉంటారని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: ఇప్పుడైతే ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతున్నా: విజయ్ దేవరకొండ)

మంచు మనోజ్ మాట్లాడుతూ..'నేను కూడా నెప్టో కిడ్‌నే. అయితే ఇక్కడ ఆ పప్పులేం ఉడకవు. బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటేనే సినిమాల్లో వస్తారంటే అది ఒక రకంగా హెల్ప్‌ అవుతుంది. నేను కూడా అలానే వచ్చా. నెప్టో కిడ్‌గా చెబుతున్నా.. ఇక్కడ అలాంటివి పనిచేయవు. ఎవరైనా దేకాల్సిందే. ఒక సినిమా సక్సెస్ అనేది.. పెద్ద స్టార్‌ చేశారా? ఎంత డబ్బు అనేది ముఖ్యం కాదు.. సినిమా ఎప్పటికీ సినిమానే. మనస్ఫూర్తిగా మనం కష్టపడి పనిచేస్తే సినిమా సక్సెస్ అవుతుంది.' అని అన్నారు.  కాగా.. మాళవికా మనోజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను రామ్‌ గోదాల డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)