Breaking News

టాలీవుడ్ ప్రిన్స్ గొప్ప మనసు.. మరో రెెండు మహోన్నత సేవలకు శ్రీకారం

Published on Tue, 03/18/2025 - 14:38

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో నటిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.

అయితే మహేశ్ బాబు సినిమాలతో పాటు సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్‌ పేరుతో పలు  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వేలమంది పేదల చిన్నారులకు వైద్య సాయానికి అండగా నిలుస్తున్నారు.

తాజాగా మహేశ్ బాబు ఫౌండేషన్‌ ద్వారా మరో సేవకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ హాజరై మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా బాలికల కోసం ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2025 నాటికి దాదాపు  1,500 మంది బాలికలకు ఉచితంగా టీకాలు వేయడం లక్ష్యమని ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్ వెల్లడించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్‌ ద్వారా తల్లి పాలు సరిపోని నవజాత శిశువులకు  ప్రతి ఏడాదికి దాదాపు 7,200 మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలిపారు.
 

 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్