Breaking News

ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్

Published on Mon, 01/19/2026 - 20:40

దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడే దండోరా సినిమా చూశానని.. చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు.

ఇంత బలమైన కథను ‍అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.

కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్‌ అనే పేరు టైటిల్‌ పెట్టనున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)