Breaking News

స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్‌.. ఆ పేరు ఎలా వచ్చిందంటే?

Published on Wed, 04/08/2026 - 07:00

మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆ స్టైలిష్ స్టార్‌ ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయ్యాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి’ నుంచి పుష్ప-2 వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో కొత్త రకమైన వైవిధ్యం ఉంటుంది. మాస్‌, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక స్టైల్‌ ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.  టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్‌ చేసిన ఐకాన్ స్టార్‌ అల్లు ‍‍అర్జున్‌ పుట్టినరోజు (ఏప్రిల్‌ 8) నేడే. ఈ సందర్భంగా బన్నీ సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ..

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన విజేత(1985) సినిమాలో బాలనటుడిగా నటించి మెప్పించిన బన్నీ.. ఆ తర్వాత 1986లో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. ఆ తర్వాత ఏకంగా 15 ఏళ్ల గ్యాప్‌ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులతో ‍అదరగొట్టాడు.

హీరోగా గంగోత్రి.. 

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో ఓ సారి అల్లు అర్జున్‌ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్‌ చేస్తుంటే బన్నీ కూడా స్టెప్పులతో అదరగొట్టేశారు.  అదే టైమ్‌లో ఈ వేడుకలకు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చి.. ఆ తర్వాత కొద్ది రోజులకు  ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేంద్రరావు. ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్‌ దగ్గరే ఉందట.

రెండో సినిమాకే నంది అవార్డు..

ఆ తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌  'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.

బన్నీ వల్లే టాలీవుడ్‌కు సిక్స్‌ పాక్..

టాలీవుడ్‌కి సిక్స్‌ ప్యాక్‌ బాడీని పరిచయం చేసింది కూడా అల్లు అర్జునే. దేశ ముదురు చిత్రంలో అల్లు అర్జున్‌ తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. ఈ మూవీలో హన్సిక హీరోయిన్‌గా నటించింది. 'గంగోత్రి'లో అమాయకుడిగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా అలరించాడు. బన్నీ తర్వాతే  రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, నాగార్జున, నితిన్‌ చాలామంది టాలీవుడ్ హీరోలు సిక్స్‌ ప్యాక్‌లో కనిపించారు.

ఐకాన్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌..

మొదట్లో అందరు అల్లు అర్జున్‌ని స్టైలిష్‌ స్టార్‌ అని పిలిచేవారు. ఆ తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప'తో ఐకాన్‌ స్టార్‌గా అయిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. 

Videos

లులు మాల్ విషయంలో తప్పు చేశాం భయపడి వెనక్కి తగ్గిన ప్రభుత్వం

బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...

భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోండి

ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస

నా భార్యను పక్కన కూర్చోపెట్టుకుని చెప్తున్నా... ABN రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ రాచమల్లు

వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?

చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం

విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్

Photos

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)