Breaking News

ట్రంప్‌కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌.. వీడియో చూశారా?

Published on Tue, 04/21/2026 - 15:04

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్  మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్‌ టీ తాగుతూ ఇండియన్‌ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్‌.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.

దీనికి డొనాల్డ్ ట్రంప్‌ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్‌లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్‌సీస్‌లో ఎస్‌వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

 

Videos

పహల్గామ్ దాడి కీలక ఉగ్రవాది ఫరూక్ అహ్మద్ భట్ హతం

పసిడి ధరల దూకుడుకు బ్రేక్.. వెండి రూ.5 వేలు ఢమాల్..!

కాపులను నరికేస్తాం! బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

Photos

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)