Breaking News

కలర్‌ ఫోటో డైరెక్టర్‌.. సతీమణికి స్పెషల్ విషెస్..!

Published on Sun, 12/07/2025 - 12:49

కలర్‌ఫోటో మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్‌ సందీప్ రాజ్‌. ప్రస్తుతం మోగ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌ రాజ్‌ గతేడాది వివాహబంధంలోకి ‍అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటి చాందిని రావును ఆయన పెళ్లాడారు. డిసెంబరు 7న తిరుపతితో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. మొదటి పెళ్లి రోజు కావడంతో డైరెక్టర్ సందీప్ రాజ్ తన భార్య చాందిని రావుకు విషెస్ తెలిపారు. హ్యాపీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ క్యూట్‌నెస్‌.. చల్లగుండు బిడ్డ అంటూ సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఈ జంటకు మ్యారేజ్ డే విషెస్ చెబుతున్నారు. 

కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ.. డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. 


 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)