Breaking News

ఓటీటీలో 8 వసంతాలు.. థియేటర్లో ఇప్పటికీ ఉందంటే.. అదే కారణం: దర్శకుడు

Published on Thu, 07/17/2025 - 17:45

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమకథ చిత్రం '8 వసంతాలు'. గత నెలలో జూన్‌ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్దగా మిక్స్డ్టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని సినిమా మాత్రం ఓటీటీలో అదరగొడుతోంది. పలువురు ఓటీటీ సినీ ప్రియులు చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 8 వసంతాల డైరెక్టర్ఫణీంద్ర నర్సెట్టి ఇటీవలే ఎనిమిది వసంతాల మూవీ స్క్రిప్ట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొందరు థియేటర్లలో సినిమాను మిస్సయ్యామని చాలామంది తనకు మేసేజ్లు చేస్తున్నారని దర్శకుడు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. జూలై 11 ఓటీటీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 8 వసంతాలు కూకట్పల్లిలోని పీవీఆర్ నెక్సస్ మాల్ థియేటర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరైనా థియేటర్లో మిస్సయితే వెళ్లి చూడాలంటూ సలహా ఇచ్చారు.

(ఇది చదవండి: ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్‌)

అయితే ఇంటర్వ్యూల్లో నన్ను ఎవరైనా పొగిడినా, మా సినిమాకు మద్దతుగా మాట్లాడినా కొందరు నేను డబ్బులిచ్చారని అంటున్నారు. నెగెటివ్పై పెట్టిన శ్రద్ధ.. పాజిటివ్ వైపు పెడితే.. మీ జీవితంతో పాటు ప్రపంచం కూడా బాగుంటుందని దర్శకుడు అన్నారు. ఒక థియేటర్ ఓనర్ ఎవరో డబ్బులు ఇచ్చారని సినిమాను ఆడించడు.. అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టే సినిమాను ఆడిస్తాడని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. థియేటర్లే దొరకడం కష్టమైన రోజుల్లో పెద్ద సినిమాలు ఉన్నా.. నెగెటివిటీ ఉన్నా.. అన్నింటిని దాటుకుని మా సినిమా థియేటర్లో 27 రోజులు పూర్తి చేసుకుందంటే అందులో ఉన్న విషయం.. అది చేయగలుతున్న ఒంటరి పోరాటం.. మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫణీంద్ర నర్సెట్టి తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.

 

8

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)