Breaking News

ప్రభాస్ ది రాజాసాబ్‌.. టీజర్‌ రిలీజ్‌పై హింట్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Published on Fri, 04/25/2025 - 07:16

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాను రొమాంటిక్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  

అయితే ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ కోసం అభిమానులు ఎప్పుడొస్తుందా ‍అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌కు సంబంధించిన ఓ హింట్ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.
హై అలర్ట్‌.. హీట్‌ వేవ్స్‌  మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

దీంతో వచ్చేనెలలోనే ది రాజాసాబ్‌ టీజర్‌ విడుదల కానుందని హింట్ ఇ‍చ్చారని తెలుస్తోంది.  ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు పూర్తయ్యాయని.. విదేశాల నుంచి ప్రభాస్‌ తిరిగి రాగానే తనతో డబ్బింగ్‌ పూర్తి చేసి టీజర్‌ విడుదల తేదీని రివీల్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి సందడి చేయనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)