Breaking News

చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్‌లో తోపులు.. ఎవరికి ఎంతంటే?

Published on Sun, 08/30/2026 - 12:20

ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్స్‌ చిత్రసీమలో సినిమాల్లోని హీరోహీరోయిన్ల చిన్నప్పటి పాత్రలు, కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. తమ నటనతోనే కథను నడిపిస్తూ.. స్టార్‌ హీరోహీరోయిన్లతో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తద్వార మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరికి నిర్మాతలు సైతం మంచి రెమ్యునరేషన్‌ అందిస్తున్నారు. మరి టాలీవుడ్‌లో మంచి పారితోషికాలు అందుకున్న ఆ చిన్నారులు ఎవరు? వారు తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో ఒకసారి తెలుసుకుందాం.

ఇదీ చదవండి: నాగ్‌ బర్త్‌డే పోస్ట్‌కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌!

నక్షత్ర
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ.. ఇరుముడి సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ చిన్నారి. ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్‌ సంపాదించుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక నక్షత్ర తీసుక్ను పారితోషికం విషయానికి వస్తే.. ఈ సినిమాకు సుమారు రూ.10లక్షలు పారితోషికం తీసుకుందట. తొలి తెలుగు సినిమాలోనే ఇంతటి ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర దక్కడంతో ఆ పాత్రకు తగినట్టుగానే మంచి రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్‌(బుల్లిరాజు)
‘సంక్రాంతికి వస్తున్నాం’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రేవంత్‌. ఇప్పుడు ఈపేరు కాస్త బుల్లిరాజుగా మారిపోయింది. ఈ చిత్రంలో  వెంకటేశ్‌ తనయుడిగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం తెచ్చిన ఫేమ్ బుల్లిరాజుకు టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ను తీసుకొచ్చింది. అదే ఊపుతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌’ సినిమాలోనూ నటించి సందడి చేశాడు. ఇటీవల రిలీజ్‌ అయిన ‘కొరియన్‌ కనకరాజు’ సినిమాలోనూ నటించి మెప్పించాడు. అయితే బుల్లిరాజు ఒక్కో సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటాడట. మూవీ బడ్జెట్‌ను బట్టి రోజుకు రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్‌.

అల్లు అర్హ
‘శాకుంతలం’ సినిమాతో సిల్వర్‌ స్రీన్‌ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అల్లు అర్జున్‌ గారాలపట్టి అల్లు అర్హ. ఈ సినిమాలో భరతుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈమెకు నిమిషానికి రెండు లక్షలు చొప్పున పారితోషికం అందంచారట. అంటే 10 నిమిషాలకు రూ.20 లక్షల వరకు అందుకుందని సమాచారం.

చదవండి:సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..?

రోహన్‌
అనేక సీరియల్స్‌తో తన నటనతో మెప్పించాడు రోహన్‌. బుల్లితెరపై కళ్యాణ వైభోగమే. సీరియల్‌తో పాపులార్‌ అయిన రోహన్‌. చెక్‌, వినయవిధేయరాయ వంటి చిత్రాల్లో నటించారు. తర్వాత 90s వెబ్‌ సిరీస్‌ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఒక్కరోజుకి రూ.30 వేల నుంచి 50 వేల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట. శ్రీకర్‌ దర్శకత్వం వహిస్తున్న సమ్మర్‌ హాలీడేస్‌ చిత్రంతో మరికొద్దిరోజుల్లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఇంకా వెండి తెరకు పరిచయం కాలేదు. కానీ సితార ఒక్కో యాడ్‌కి రూ. 15​‍లక్షల నుంచి 25లక్షల వరకు పారితోషికం తీసుకుంటోందట. అయితే వార్షికంగా ఆమె చేసే ప్రచారాల ద్వారా రూ. 2.5 కోట్లకు పైగా ఆదాయం వస్తోందని యాడ్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా చిన్న వయసులోనే ఓ జ్యుయలరీ సంస్థకి బ్రాండ్‌కు ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార గతంలో ఓ ఇంటర్వ్యులో చెప్పారు. ( కొత్త సీన్లతో మళ్లీ అర్జున్‌రెడ్డి.. )

Videos

మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

ధర్మాన ప్రసాద్ పై అక్రమ కేసు

నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

Photos

+5

సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)