Breaking News

ఉస్తాద్ భగత్‌ సింగ్‌ నుంచి తీసేశారా?.. టాలీవుడ్ హీరోయిన్ క్లారిటీ..!

Published on Wed, 01/07/2026 - 00:10

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో‌ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి సాక్షిని తొలగించారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సాక్షి వైద్య స్పందించింది. తనను తీసివేశారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో తనకు కీలక పాత్ర పోషించే అవకాశముందని సాక్షి వైద్య తెలిపింది. కానీ ఆ సమయంలో నా ఫ్యామిలీ ‍అత్యవసర పరిస్థితి వల్ల నేను వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి మరుసటి రోజే షూటింగ్‌ ప్రారంభ కానుందని నాతో చెప్పారు. కానీ ఆ పరిస్థితుల్లో నేను డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని సాక్షి వైద్య క్లారిటీ ఇచ్చింది.

 సాక్షి వైద్య మాట్లాడుతూ..' తెలుగులో నేను నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అందుకే నన్ను ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ నుంచి తీసేశారని వార్తలొచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్‌ మూవీలో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నా కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో మూవీ టీమ్ సభ్యులు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వెళ్లలేని పరిస్థితుల్లో తేదీలు సర్దుబాటుచేయలేక ఆ ఛాన్స్ వదులుకున్నా.  కానీ నాపై మరోలా రూమర్స్ వచ్చాయి. అలాంటివి నేను పట్టించుకోను' అని తెలిపింది.

కాగా.. సాక్షి వైద్య ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఆమె శర్వానంద్ సరసన నటించిన నారీ నారీ నడుమ మురారి జనవరి 14న విడుదల కానుంది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో  తెరకెక్కించిన ఈ చిత్రంలో సంయుక్త కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. 

Videos

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)