మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
నేను క్లియర్‌గా చెప్పా.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే నా పోరాటం: పూనమ్ కౌర్ మరో పోస్ట్
Published on Wed, 05/21/2025 - 14:46
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. సినిమా విషయాలే కాదు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంది.
ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చెప్పాను.. మళ్లీ కూడా చెప్తున్నా.. నేను మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆ తర్వాత ఝాన్సీ గారితో మాట్లాడానని.. కానీ మీటింగ్ కాస్తా ఆలస్యమవుతుందని చెప్పారని.. అప్పటివరకు తమను డిస్టర్బ్ చేయవద్దని చెప్పారని కోరింది.

కానీ ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారు.. క్లియర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్‌తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్‌కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్‌షాట్‍ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Tags : 1