మీరిద్దరు శుభంతో జర్నీ మొదలెట్టారు.. ఎప్పటికీ అలాగే ఉండాలి: సమంతపై టాలీవుడ్ నటి కామెంట్స్

Published on Fri, 05/16/2025 - 18:41

ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తాను నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కించిన శుభం మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో సామ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తన టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి మధుమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.

మధుమణి మాట్లాడుతూ..'నా 39 ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులు గెలుచుకున్నా. ఎంతో హీరోలతో పాటు హీరోయిన్లకు తల్లిగా నటించా. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు రంగస్థలంలో అమ్మగా నటించే అవకాశం చేజారిపోయింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది. శుభం కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నా అదృష్టం కలిసొచ్చి శుభం మూవీలో నటించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్‌కు శుభం. రాజ్ మీరు కలిసి శుభంతో ప్రయాణం మొదలెట్టారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ' అని ఇద్దరినీ దీవించింది.

అయితే ఇది విన్న సమంత ఫ్యాన్స్‌ కాస్తా షాకింగ్‌కు గురవుతున్నారు. రాజ్ నిడిమోరు- సామ్ డేటింగ్‌పై చర్చ జరుగుతున్న వేళ మధుమణి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా..ఇటీవల మరోసారి సమంత-రాజ్ నిడిమోరు గురించి మరోసారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2, సిటాడెల్‌: హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్‌ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

Videos

అప్పన్న ఆలయంలో అపచారం.. పులిహోర ప్రసాదంలో నత్త

పేరు మార్చితే వైఎస్ జగన్ బ్రాండ్ పోతుందా..?

Garam Garam Varthalu: వదిలేసిన సరే.. ఫాలో అవుతున్న రామ చిలక

Garam Garam Varthalu: ఘోర లారీ ప్రమాదం.. బొలెరో నుజ్జునుజ్జు

Ys Jagan: తెలుగు ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

బాబు ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలపై పెను ఆర్థిక భారం

Magazine Story: దారి తప్పిన నాలుగో సింహం పోలీసుల మెడకు ఉచ్చు

Medical Colleges: ప్రజామోదం లేని విధానాన్ని మార్చుకోవాలని YSRCP నేతలు డిమాండ్

Crime Report: ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక

KSR: బాలకృష్ణకు ఒక న్యాయం జగన్‌కు ఒక న్యాయమా..?

Photos

+5

వైకుంఠ ఏకాదశి : తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)

+5

‘శంబల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)