Breaking News

బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు రిలీఫ్

Published on Thu, 01/02/2025 - 15:33

బెంగళూరు రేవ్‌ పార్టీ (Bengaluru Rave Party) కేసులో టాలీవుడ్ నటి హేమకు(Hema) రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని వాయిదా వేసింది.

కాగా.. గతంలో రేవ్ పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టేయాలని హేమ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు స్టే విధించింది. అప్పటివరకూ ఈ స్టే కొనసాగుతుందని పేర్కొంది.

కాగా.. గతేడాది మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలయ్యారు. ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు.

మా సస్పెన్షన్ ఎత్తివేత..

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్‌ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు  మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె  ప్రాథమిక సభ్యత్వాన్ని వారు  ఆ సమయంలో తొలగించారు. అయితే హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్‌ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్‌ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)