Breaking News

దీపావళి పండుగ.. ఆ స్థానమేంటో ఇప్పుడు అర్థమైంది.. అనసూయ పోస్ట్ వైరల్

Published on Mon, 10/20/2025 - 17:08

టాలీవుడ్ నటి అనసూయ దీపావళి వైబ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇంట్లో నా సోదరీమణులతో కలిసి ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుకునేదాన్ని అని పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడేమే ఒక భార్యగా, తల్లిగా.. నేను అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నట్లు అనసూయ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

అనసూయ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా చిన్నప్పుడు దీపావళి కోసం ఏడాది పొడవునా నా కళ్లు ఎదురు చూసేవి.  ఆ రోజుల్లో తెల్లవారుజామునే మంగళారతి.. పాపాజీ ఆశీస్సులు ఇచ్చే ఆ మధురమైన క్షణం.. అలాగే పాకెట్ మనీ.. నేను, నా సోదరీమణులు దాని కోసం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం. ఇంట్లో తయారుచేసిన స్వీట్ల వాసనతో ఆనందంతో నిండిపోయేది. కొత్త బట్టలు.. రంగురంగుల రంగోలి.. ఇంటిని వెలిగించే దీపాల వరుసలు.. క్రాకర్స్, చిచ్చుబుడ్డీలు, ఉల్లిపాయ బాంబులతో సంతోషంగా జరుపుకునేవాళ్లం. కానీ నేడు.. ఒక భార్యగా, తల్లిగా అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నా. అప్పుడు అమ్మ అన్ని చిరునవ్వుల వెనుక కొంచెం ఆందోళన చెందుతున్నట్లు నాకిప్పుడు అర్థమైంది..  ఆమె మా బాల్యంలో కురిపించిన ఆనందం, ప్రేమ, వెలుగు అంతా మేము అస్వాదించామని' పోస్ట్ చేసింది.

కానీ ఇప్పుడు నేను అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తినని.. అది ఒక అందమైన అనుభవమని గ్రహించానని అనసూయ రాసుకొచ్చింది. ప్రతి ఇంట్లోని మహిళలకు అపారమైన గౌరవం మన పండుగలను జ్ఞాపకాలుగా మార్చిందని వెల్లడించింది. ఈ రోజు.. నేను అలసిపోయినా చాలా సంతృప్తిగా ఉన్నా.. నా చిన్ననాటి దీపావళిని మిస్ అవుతున్నా. కానీ ఏదో ఒక రోజు.. నా పిల్లలు ఈ దీపావళిని తిరిగి చూసుకుని.. నాలాగే అదే రకమైన ఫీలింగ్‌ను అనుభవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ దీపాల కాంతి అందరి జీవితాల్లో చాలా కాలం పాటు నిలిచి ఉండాలని, ప్రేమ, ఆనందంతో నిండిన  మీ అందరికీ, మీ ప్రియమైన వారికి సంతోషకరమైన, ప్రకాశవంతమైన, సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు అంటూ అనసూయ విషెస్ తెలిపింది. ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)