Breaking News

'సంక్రాంతికి వస్తున్నాం-2 వస్తే ఆరుగురు ఉంటారు'

Published on Sun, 07/06/2025 - 18:25

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగన ముద్ర వేసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ సతీమణిగా నటించి అభిమానులను అలరించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న  ఐశ్వర్య రాజేశ్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైంది.

ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన రోల్ గురించి మాట్లాడింది. పిల్లలకు తల్లి పాత్రలో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. మంచి నటిగా రాణించాలంటే ఎలాంటి పాత్రనైనా చేయాల్సిందేనని.. ఇలాంటి పాత్రలు చేయడానికి వయస్సు  అడ్డంకి కాదని వెల్లడించింది. నేను చాలా సినిమాల్లో తల్లిగానే నటించానని పేర్కొంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నలుగురు పిల్లలకు అమ్మగా నటించానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం-2 మూవీ చేస్తే కనుక నాకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్‌ అనిల్ రావిపూడి చెప్పారని ‍తానా సభలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)