కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
'ఆయనను గురువులా భావిస్తా'.. సైన్ లాంగ్వేజ్‌లో అభినయ స్పీచ్ వైరల్
Published on Thu, 03/26/2026 - 16:42
టాలీవుడ్ నటి అభినయ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్మేని సెల్వం అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభినయ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభినయ తన సైన్ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచే అభినయకు మాటలు రావన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక స్పీచ్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సముద్రఖనిపై అభినయ ప్రశంసలు కురిపించింది. నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని అని తెలిపింది.
ఆయనను ఒక గురువులా భావిస్తానని అభినయ వెల్లడించారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదని.. అంతకు మించిన నటుడని కొనియాడారు. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ కలుపుకుని 64 సినిమాలు మాత్రమే చేశానని అభినయ తెలిపారు. సముద్రఖని చెప్పినట్లు వెయ్యి సినిమాలు చేస్తానో లేదో వేచి చూడాల్సిందేనని అన్నారు.
ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా.. టాలీవుడ్‌లో 'నేనింతే' సినిమాతో పరిచయం అయిన నటి అభినయ తనకు కాబోయే భర్తను సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేసింది. తెలుగులో కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీలో చిన్ని పాత్రలో బాగా ఆకట్టుకుంది. అలా టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో అభినయ తన నటనతో ఆకట్టుకుంది.
సైన్ లాంగ్వేజ్ లో నటి అభినయ స్పీచ్...
నాకు తమిళంలో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది సముద్రఖని గారు
సముద్రఖని గారు మంచి దర్శకులు అలాగే అంతకు మించి మంచి నటుడు: అభినయ#Abhinaya #CarmeniSelvam #Samuthirakani pic.twitter.com/lukFHtLVFJ— Filmy Focus (@FilmyFocus) March 26, 2026
Tags : 1