హీరో రాజశేఖర్‌కు గోటీల బిజినెస్‌.. ఆయన ఏమన్నారంటే?

Published on Sat, 03/14/2026 - 15:58

టాలీవుడ్ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్‌ ఆడియన్స్‌ను మెప్పించింది.

అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్‌ ప్రారంభించారని నెట్టింట మీమ్స్‌ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.

తాజాగా తనపై వచ్చిన మీమ్స్‌పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు.  తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.  కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ ‍చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)