Breaking News

గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర

Published on Mon, 03/24/2025 - 19:22

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'.  ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్‌ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్‌ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్‌లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.

నవీన్‌ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్‌, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్‌ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్‌ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్‌ సార్‌తో, దిల్‌రాజ్‌ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్‌ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది'  అని అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)