'గుండెలో బాధను దిగమింగుకుని'.. తండ్రి మరణం వేళ జోష్ రవి ఎమోషనల్ పోస్ట్!

Published on Tue, 11/18/2025 - 18:34


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గతవారమే ఈ సంఘటన జరగ్గా.. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తన తండ్రి మరణంతో జోష్ రవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అనేది నీకు సరదా..నాకు సినిమానే బతుకుదెరువు.. సినిమా నాకు సెంటిమెంట్.. అది నీకు జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమా అనేది నీకు వీకెండ్.. నాకు టిల్ మై లైఫ్ ఎండ్..అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు కష్టాలు మర్చిపోవడానికి థియేటర్‌కు వస్తావ్.. నేను తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని నవ్విస్తాను.. నీకు బాధ వస్తే ఏడుస్తావ్.. అదే నాకు వస్తే సినిమా చూస్తా అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. తన తండ్రి చనిపోయినా కూడా బాధను దిగమింగుకుని షూటింగ్ పూర్తి చేశారు. ఇది చూస్తుంటే ఆయనకు సినిమాపై ఉన్న కమిట్‌మెంట్‌ ఏంటో అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు జోష్ రవికి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. 'జోష్' సినిమాతో నటుడిగా పరిచయమైన రవి.. తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించాడు. 'జబర్దస్త్' కామెడీ షోలోనూ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు.

 

 

Videos

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్

50 సీట్లు చాలు.. అంతకు మించి వద్దు

కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)