Breaking News

ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్

Published on Thu, 02/12/2026 - 15:46

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్‌ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.

కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్‌ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ‍ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించనుంది. గోపి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. 
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)