ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
‘జననాయగన్’ కోసం ఢిల్లీకి సీఎం విజయ్!
Published on Sat, 06/20/2026 - 09:45
ప్రముఖ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన కొన్ని చిత్రాలు విడుదల సమయంలో సమస్యలు ఎదుర్కొన్నాయి కానీ , జననాయగన్ చిత్రం అంత పెద్ద సమస్యలను ఎదుర్కొన లేదని చెప్పవచ్చు. చిత్రం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు చాలా స్మూత్గా జరిగిపోయింది. ఎటు తిరిగీ సెన్సార్ విషయంలోనే పీట ముడిపడింది. నిజానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ లో సమస్య ఎదురౌతుందని ఎవరు ఊహించలేదు. శాసనసభ ఎన్నికల సమయం కావడం, నటుడు విజయ్ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం వంటి విషయాలు తోడవడం, చిత్రంలో చర్చనీయాంశ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో వంటి అంశాలు జననాయగన్ చిత్రానికి సెన్సార్ సమస్యలకు కారణం కావచ్చు.
దీంతో గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు సుమారు 6 నెలలుగా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రం ఇంటర్నెట్లో అనధికారికంగా విడుదలై యూనిట్ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే చిత్ర నిర్మాత వెంకట్ నారాయణన్ మాత్రం జననాయగన్ చిత్రాన్ని తెరపైకి తీసుకు రావడానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన చిత్ర విడుదల విషయమై ఢిల్లీకి చేరుకున్నారు.
అక్కడ సెన్సార్ బోర్డు ప్రధాన అధికారితో మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో జననాయగన్ చిత్రానికి ఈ నెల 19వ తేదీ (శుక్రవారం) లోపల సర్టిఫికెట్ వస్తుందనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇదే జరిగితే జననాయగన్ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్ అభిమానులు జననాయగన్ చిత్ర విడుదల కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
Tags : 1