Breaking News

అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవు.. బోరున ఏడ్చేసిన నటి

Published on Wed, 04/09/2025 - 13:33

కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఏళ్లతరబడి కష్టపడుతున్నా దానికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం లేకపోతే ఆ బాధ తట్టుకోలేం. ఒకప్పుడు నటి తిలోత్తమ షోమ్‌ (Tillotama Shome) పరిస్థితి కూడా ఇదే! ఈ బెంగాలీ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలవుతోంది. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్‌లో అనేక సినిమాలు చేసిన ఆమె ఇటీవలే షాడోబాక్స్‌ చిత్రంతో అలరించింది. తాజాగా ఈమె తన అనుభవాలను చెప్తూ బోరున ఏడ్చేసింది.

పారితోషికంతో కారు కొంటా..
తిలోత్తమ మాట్లాడుతూ.. నేను నటించిన సినిమాకు ఓ డైరెక్టర్‌ చాలా తక్కువ పారితోషికం ఇచ్చాడు. సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక జరిగిన పార్టీలో అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వు దేనిపై అయినా మనసు పారేసుకున్నావా? అని అడిగారు. అందుకు నేను అవును, ఫలానా కారు అంటే నాకిష్టం. ఆ కారు రేటుకు తగ్గట్లుగా నాకు పారితోషికం వచ్చినప్పుడు కచ్చితంగా దాన్ని కొంటాను అని చెప్పాను.

అంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేవ్‌
ఇంతలో ఆ డైరెక్టర్‌ మధ్యలో కలగజేసుకుని.. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు.. కానీ ఎప్పటికీ నువ్వు ఊహించినంత డబ్బు సంపాదించలేవు అన్నాడు. ఇదెంత అన్యాయం కదా..! కానీ ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తూ.. మనకెంత టాలెంట్‌ ఉన్నా సరే దానికి తగ్గట్లు రెమ్యునరేషన్‌ ఇవ్వరు. ఇప్పటికీ ఆ దర్శకుడు అన్న మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

రెట్టింపు తీసుకున్నా..
అయితే అతడి మాటలు నాలో కసిని పెంచాయి. నేను ఎలాగైనా చెప్పినంత సంపాదించి తీరాలనుకున్నాను. తర్వాత నాకో సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు నేను అడిగినంత ఇవ్వాలన్నాను. నాలుగు నెలల తర్వాత మా చర్చలు సఫలమయ్యాయి. నేను కలగన్నదానికంటే రెట్టింపు పారితోషికం తీసుకున్నాను. ఆ సినిమా పేరు చెప్పలేను అంటూ నటి కన్నీళ్లు పెట్టుకుంది. తిలోత్తమ.. సర్‌, ద నైట్‌ మేనేజర్‌, మాన్‌సూన్‌ వెడ్డింగ్‌, ఢిల్లీ క్రైమ్‌, లస్ట్‌ స్టోరీస్‌ 2, పాతాళ్‌ లోక్‌ 2 వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు దగ్గరైంది.

చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్‌ బిల్లు.. కంగనా షాక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)