Breaking News

పేరుకే ఫ్రాంచైజీ.. అన్నీ మన రీమేక్‌లే

Published on Sun, 09/07/2025 - 17:45

ఒకప్పుడు రీమేక్ అంటే బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎంత బాగా తీసినా సరే జనాలు.. ఒరిజినల్‍‌తో పోల్చి చూస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో పలు భాషల్లో వచ్చిన, వస్తున్న రీమేక్స్ అన్నీ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం హిందీలోనూ 'బాఘీ 4' పేరుతో ఓ మూవీ రిలీజైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం కూడా రీమేక్ అనే సంగతి బయటపడింది.

(ఇదీ చదవండి: 'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?)

ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా టైగర్ ష్రాప్.. ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'హీరో పంతి' అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఇది యావరేజ్ అనిపించుకుంది. టైగర్ యాక్ట్ చేసిన తొలి మూవీ ఓ రీమేక్. అల్లు అర్జున్ 'పరుగు' చిత్రమే ఇది. అలానే టైగర్ ష్రాఫ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది 'బాఘీ' ఫ్రాంచైజీ. ఇప్పటివరకు ఇందులో నాలుగు మూవీస్ రిలీజ్ కాగా అవన్నీ దక్షిణాది చిత్రాల ఆధారంగా తీసిన రీమేక్స్. కాకపోతే ఎక్కడా అధికారికంగా ఇది దీని రీమేక్ అని టీమ్ చెప్పలేదు.

బాఘీ.. ప్రభాస్ 'వర్షం' రీమేక్, బాఘీ 2.. అడివి శేష్ 'క్షణం' రీమేక్, బాఘీ 3.. తమిళ చిత్రం 'వెట్టై' రీమేక్, తాజాగా రిలీజైన బాఘీ 4.. తమిళ మూవీ 'ఐతు ఐతు ఐతు'కి రీమేక్. ఇలా పేరుకే యాక్షన్ ఫ్రాంచైజీ అని పెట్టుకున్నారు కానీ నచ్చిన రీమేక్స్‌ని ఇష్టమొచ్చినట్లు మార్చేసి తీసిపడేస్తున్నారు. మొదటి భాగానికే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే వరసగా సీక్వెల్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రిలీజైన నాలుగో భాగానికి కూడా ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. టాప్ ఇంగ్లీష్ వెబ్ సైట్స్ అన్నీ 1 రేటింగ్ ఇచ్చాయి. మరి ఇప్పటికైనా టైగర్.. బాఘీ ఫ్రాంచైజీని ఆపుతాడా? లేదంటే త్వరలో ఐదో పార్ట్‌తో వస్తాడా? అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)