Breaking News

ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్ రిలేషన్‌.. ఆఫీషియల్‌ ప్రకటన

Published on Wed, 11/18/2026 - 06:57

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగాను రాణిస్తున్నారు. తాజాగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు తరుణ్ భాస్కర్‌ మదర్‌  గీతా భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె తరుణ్ భాస్కర్‌ పార్ట్‌నర్‌ ఎవరనే విషయంపై కామెంట్స్ చేశారు. ఆమెనే తరుణ్ సోల్‌మేట్‌ అంటూ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఈ రెండేళ్లలో తరుణ్ భాస్కర్ ఎన్నో ఒడుదొడుకులు చూశాడని ఆమె అన్నారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం వంటి సమస్యలు ఎన్నో వచ్చి పడ్డాయని తెలిపారు. ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి పూట 2 గంటలకి, 4 గంటలకి భోజనం పెట్టడానికి ఒక మంచి సోల్ మేట్ దొరికిందని తెలిపింది. ఆమె మరెవరో కాదు.. మనందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈషానే అంటూ వెల్లడించారు. ఈషానే తరుణ్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు.. మంచి సోల్‌మేట్ అని ప్రకటించింది. ఈషా వల్లనే ఈ మూవీని పూర్తి చేయగలిగాడని కూడా పేర్కొన్నారు. ఈషా రూపంలో తరుణ్‌కి మంచి తోడు దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు ఇక తెరపడింది. త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)