Breaking News

బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ'

Published on Tue, 11/18/2025 - 11:32

బిగ్‌బాస్‌ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో  ఎమోషన్స్‌తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఫస్ట్‌ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు.  ఈ క్రమంలో బిగ్‌బాస్‌ టీమ్‌ ప్రోమో వదిలింది.

తనూజ చెల్లి పూజ బిగ్‌బాస్‌లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్‌ అయిపోయింది. హౌస్‌లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది.  

తనూజ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. అక్క అనూజ లాయర్ కాగా.. చెల్లి పూజ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అనూజకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె కూతురు కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది.  

 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)