Breaking News

ఓటీటీలో బంగారు వీరుడు 'తంగలాన్‌'

Published on Tue, 09/10/2024 - 10:11

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్‌. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. విక్రమ్‌ కెరియర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా తంగలాన్‌ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాణిజ్యపరంగా కూడా సుమారు రూ. 110 కోట్లు రాబట్టిన తంగలాన్‌ బాలీవుడ్‌లో కూడా తాజాగా విడుదలైంది. అక్కడి సినీ అభిమానులు కూడా విక్రమ్‌ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే, తాజాగా తంగలాన్‌ ఓటీటీ ప్రకటన గురించి ఒక వార్త వైరల్‌ అవుతుంది.

తంగలాన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. విక్రమ్‌ మీద నమ్మకంతో సినిమా విడుదలకు ముందే డీల్‌ సెట్‌ చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుందని  నెట్‍ఫ్లిక్స్ ప్రకటించినట్లు ఒక పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. అయితే, అదే నిజమని ఇండస్ట్రీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక సోషల్‌మీడియాలో తంగలాన్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు. సెప్టెంబర్‌ 20 తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో మాత్రమే తంగలాన్‌ విడుదల తప్పకుండా అవుతుందని సమాచారం.  అయితే, హిందీ వర్షన్‌ మాత్రం ఒక వారం గ్యాప్‌తో రిలీజ్‌ కానున్నట్లు టాక్‌.

కథేంటి..?
గోల్డ్ హంట్ నేపథ్యంలో  తంగలాన్‌ను తెరకెక్కించారు పా. రంజిత్. 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో జరిగిన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీకి సీక్వెల్ తంగలాన్ 2 ఉంటుందని విక్రమ్ వెల్లడించారు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)