Breaking News

ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Published on Fri, 08/22/2025 - 15:53

దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?

దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అ‍ట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్‌మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.

(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)

ఓసారి షూటింగ్‌లో విజయ్‌ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్‌లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.

(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి)

Videos

Anantha Venkatarami Reddy: నీ తల్లి అయితే ఒకటి ఎన్టీఆర్ తల్లి అయితే మరొకటా

'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్

మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ

జనాలకు అర్థమైంది..? ఏపీలో సాక్షి టీవీ కోసం డిమాండ్స్

Viral Video: వామ్మో..! కోబ్రాతో చెడుగుడు ఆడుకున్నబుడ్డోడు!

చైనాకు దగ్గరవుతోన్న భారత్? టిక్ టాక్ రీ ఎంట్రీ.. నిషేధంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ

పాఠశాలలో పిల్ల ఏనుగు

కుక్కలతో మాట్లాడుతున్న రాజేష్

ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్

Photos

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?