Breaking News

కృతిశెట్టినే కావాలంటోన్న విజయ్‌.. భారీ ప్రాజెక్టు కొట్టేసిన బేబమ్మ

Published on Sun, 05/28/2023 - 07:12

దళపతి విజయ్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రేజీ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. లియో చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో నటుడు విజయ్‌ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించబోతున్నారు.

ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం కస్టడీ ఆశించిన విజయాన్ని సాధించకపోయినా వెంటనే దళపతి విజయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా లక్కే. ఇదే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. కాగా ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇందులో నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించనున్నట్లు తాజా సమాచారం. కాకపోతే ఇందులో విజయ్‌తో జతకట్టే హీరోయిన్‌ కోసం చర్చలు జరుపుతున్న లిస్ట్‌ పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార, తమన్న, కృతిశెట్టి, కల్యాణి ప్రియదర్శన్‌, మృణాల్‌ ఠాకూర్‌లో ఒకరిని ఎంపిక చేసి పనిలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

అయితే వీరిలో నటి కృతిశెట్టికే దళపతి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కస్టడీ చిత్రంలో నటించింది. కాగా ఇందులో హీరోయిన్‌ ఎవరనే సస్పెన్స్‌ త్వరలోనే విడిపోతుంది. జూన్‌ 22న విజయ్‌ 68వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)