Breaking News

దళపతి విజయ్‌ అభిమానుల గుండె పగిలే వార్త..

Published on Fri, 02/02/2024 - 15:45

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు తమిళనాడులోనే కాదు తెలుగులోనూ అభిమానులున్నారు. రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం కోసం ఎప్పటినుంచో పావులు కదుపుతూ వస్తున్నాడు. ఎట్టకేలకు శుక్రవారం(ఫిబ్రవరి 2న) తను పాలిటిక్స్‌లో అడుగుపెడుతున్నట్లు ప్రకటించాడు. తమిళగ వెట్రి కళగం అనే కొత్త పార్టీని స్థాపించాడు. ప్రజల సేవే లక్ష్యంగా పని చేస్తానని, పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని వెల్లడించాడు.

ప్రజల సేవలో నిమగ్నం కానున్న హీరో
ఇక్కడే అభిమానుల గుండె పగిలే వార్త కూడా చెప్పాడు. ఇక మీదట సినిమాలు చేయబోనన్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సినిమాలకు శాశ్వత విరామం ప్రకటించనున్నట్లు తెలిపాడు. సినిమాలు మానేసి పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తానంటున్నాడు. విజయ్‌ ప్రస్తుతం 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (G.O.A.T)' అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

అదే చివరి సినిమా
ఇందులో స్నేహ, లైలా, మోహన్‌, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీని తర్వాత కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌లో 69వ సినిమా చేయనున్నాడు. ఇక ఇదే చివరి చిత్రం కానుందా? అని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఈ చిత్రం తర్వాత ఆయన వెండితెరపై కనిపించడంటేనే మనసు చివుక్కుమంటుందంటున్నారు ఫ్యాన్స్‌.

చదవండి: టార్గెట్‌ ఫిక్స్‌.. రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్‌
పూనం పాండే: చనిపోయేంత వరకు విమర్శలు, వివాదాలే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)