విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్

Published on Tue, 10/13/2026 - 21:26

తెలుగు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి ఐశ్వర్య పిస్సే షాకింగ్ పోస్ట్ పెట్టింది. తాను విడాకులు తీసుకున్న విషయాన్ని ‍ధ్రువీకరించింది. 'నా పేరు మీనాక్షి' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 'అగ్నిసాక్షి'తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడలో హీరోయిన్‌గా బిజీగా మారిపోయింది.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)

కెరీర్ పీక్స్ ఉన్న టైంలో అంటే 2019లో సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి అన్నయ్య హరి వినయ్‌ని ఐశ్వర్య వివాహమాడింది. దాదాపు ఏడేళ్లపాటు కలిసున్న వీళ్లు గత ఏడాది కాలంగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వార్తలు రాగా వాటిపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య.. సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.

'మేం ఇద్దరం గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నాం. చాలాసార్లు ఆలోచించిన తర్వాతే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాం. ఇది మా ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం. ఈ కష్టసమయంలో మా మనశ్శాంతి, వ్యక్తిగత గోప్యత గౌరవించాలని అభిమానులను, శ్రేయోభిలాషులను కోరుతున్నాను. దయచేసి మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకుని ఆమోదించాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను'

'ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, సీరియల్ సన్నివేశాలను సందర్భం లేకుండా వాడుకోవడం లేదా నా వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో నా ఫోటోలని పోస్ట్ చేసేవాళ్లు నా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయొద్దు. సీరియల్ సన్నివేశాలకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. నా వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతీసేలా లేదా తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోను' అని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. 

(ఇదీ చదవండి: 'రణబాలి' సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే?)

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)