అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
Published on Mon, 03/31/2025 - 16:18
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలు చిత్రాలు తీసిన నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి తాజాగా విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)
ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత అంటే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు బంధువు. ఈవీవీ సోదరిని ఈయన పెళ్లి చేసుకున్నారు.
అల్లరి నరేశ్ 'నేను', అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా తదితర సినిమాలని బ్రహ్మానందం నిర్మించారు. ఇప్పుడు ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)
Tags : 1