Breaking News

తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారంటే?

Published on Thu, 02/26/2026 - 12:09

తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి టాటా చెప్పేశాడు. హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఉదయ్‌పుర్ వేదికగా ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విజయ్ వయసు 36 కాగా రష్మిక వయసు 29. ఈ సందర్భంగా తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరెప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారంటే?

(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‪‌బాస్ 8' విజేత నిఖిల్)

  1. చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. 27 ఏళ్లకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నాడు.

  2. ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష‍్మీ ప్రణతిని వివాహమాడాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు.

  3. హీరో నాని కూడా తనకు 28 ఏళ్లున్నప్పుడే వైజాగ్‌కి చెందిన అంజనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.

  4. అల్లు అర్జున్ తన 29 ఏళ్లకు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. వీళ్లకు ఓ బాబు, పాప ఉన్నారు.

  5. మహేశ్ బాబు కూడా తన 29 ఏటనే నమ్రతతో ఏడడుగులు వేశాడు. వీళ్లది ప్రేమ వివాహమే. ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

  6. నాగచైతన్య 30 ఏళ్ల వయసులో సమంతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లాడాడు.

  7. మెగాహీరో వరుణ్ తేజ్ 33వ ఏట హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడాడు. ఇది ప్రేమ వివాహం. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.

  8. హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.

  9. రానా తన 35వ ఏట మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

  10. విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.

  11. హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కొడుకు పుట్టాడు.

  12. హీరో శర్వానంద్ అయితే 38 ఏళ్లకు రక్షితా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు ఉంది.

ఇంతమంది హీరోలు పెళ్లిచేసుకుంటున్నారు గానీ ప్రభాస్ మాత్రం 47 ఏళ్లొచ్చినా ఇప్పటికే సింగిల్‌గానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటాడో లేదో?

(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్)

Videos

Komarada Nagavali River:ఇంటర్ విద్యార్థులకు నది దాటడమే ఓ పరీక్ష

మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

సేతుపతి, సాయి పల్లవితో మణిరత్నం లవ్ స్టోరీ

సుప్రీంకోర్టును కూడా లెక్క చెయ్యకుండా సిగ్గులేకుండా వికృత చేష్టలు చేస్తున్నారు

Hyd: షాపింగ్ మాల్‌కు టెంపుల్ సెట్ వేయడంతో భారీగా వ్యాపించిన మంటలు

9 ఏళ్ల బాలికకు హార్ట్ ఎటాక్! ప్లే గ్రౌండ్ లో కుప్పకూలి చనిపోయిన చిన్నారి

రఘురామను అరెస్ట్ చేయాలి.. IPS PV సునీల్ కుమార్ సంచలన ట్వీట్

Nellore: కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్

లడ్డూపై చర్చ జరుపుతామని మాట మార్చిన ప్రభుత్వం

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ముంబైలో నా వారం ఇలా గడిచింది.. మృణాల్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)

+5

’విష్ణు విన్యాసం‘ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

ప్రియురాలితో బిగ్‌బాస్ షణ్ముఖ్ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బంధువుల పెళ్లిలో మెరిసిన అల్లు స్నేహారెడ్డి (ఫోటోలు)

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)