Breaking News

ఈషాపై నెగెటివిటీ.. చచ్చిపోదాం అనిపించింది: డైరెక్టర్‌

Published on Thu, 01/01/2026 - 07:52

చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కథ బాగుండే సినిమాయే ఆడుతుంది. కంటెంట్‌ బాగుండి, నిజాయితీతో సినిమా తీస్తే హిట్‌ చేస్తామని ఈషా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు చెప్పారు. త్రిగుణ్‌, అఖిల్‌ రాజ్‌ హీరోలుగా, హెబ్బా పటేల్‌, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ఈషా. 

డిసెంబర్‌ 25న రిలీజైన ఈషా
శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ డిసెంబర్‌ 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో కేఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈషా జర్నీ చాలా పెద్దది. ఈ ప్రయాణంలో శ్రీనివాస్‌ చాలా కష్టపడ్డాడు అని తెలిపారు. ఈషా ఆడియన్స్‌కు కనెక్ట్‌ కాకపోతే ఐదురోజుల్లోనే ఆరు కోట్ల గ్రాస్‌ వచ్చేవి కావు అని బన్నీ వాస్‌ పేర్కొన్నారు. ఆడియన్స్‌ సపోర్ట్‌ చేయడం వల్లే ఈషా వంటి చిత్రాలు విజయాన్ని సాధిస్తుంటాయి అని వంశీ నందిపాటి చెప్పారు. 

ఐదు రోజుల్లోనే..
సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి.. అంతేకానీ మమ్మల్ని వేధించకండి. మా సినిమాకు వచ్చిన రివ్యూస్‌, రేటింగ్స్‌ చూసి సూసైడ్‌ చేసుకుందాం అనిపించింది. ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామా అని భయంతో వణికిపోయాను. ఆ నెగెటివిటీ చూసి చaనిపోవాలనే అనిపించింది. అదంతా తట్టుకుని ఇప్పుడు స్టేజీపై నిలబడ్డాను అని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మా మూవీకి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌ పడుతున్నాయి అని హేమ వెంకటేశ్వరరావు అన్నారు.

గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: ఇండియన్‌ సినిమా ఆజానుబాహుడు.. స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)