Breaking News

సినిమా టికెట్ ధరల పెంపు... హైకోర్టు కీలక ఆదేశాలు

Published on Tue, 01/20/2026 - 16:28

తెలంగాణలో సినిమా టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను  ఆదేశించింది.  ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రానికి టికెట్‌ ధరల పెంపు అంశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. 

ది రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలపై ఈనెల 9న వాదనలు జరగ్గా.. అంతకుముందే అంటే 8వ తేదీ అర్ధరాత్రి ది రాజాసాబ్ మూవీ టికెట్‌ ధరలు, ప్రీమియర్లకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని లాయర్ విజయ్‌ గోపాల్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. కానీ ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)