హైకోర్టులో చిరు, ప్రభాస్‌ నిర్మాతలకు ఊరట

Published on Wed, 01/07/2026 - 12:23

మెగాస్టార్‌ చిరంజీవి ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్‌, మనశంకర్‌ వరప్రసాద్‌ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 

'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని  కోర్టును కోరారు.

గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.

సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్‌ ఛేంజర్‌ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)