Breaking News

పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు.. తెలంగాణలోనూ భారీగా టికెట్ ధరల పెంపు!

Published on Mon, 07/21/2025 - 21:08

పవన్ కల్యాణ్ ‍హీరోగా వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. టికెట్ ధరలతో పాటు ఈనెల 23 ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600 వరకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతే కాకుండా ఈ నెల 24 నుంచి 27 వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకోడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి రోజు నుంచే మల్టీప్లెక్స్‌ల్లో  రూ.200, సింగిల్ స్క్రీన్లలో రూ.150 టికెట్ ధరలు పెంచుకునేందుకునేలా వెసులుబాటు కల్పించింది. అలాగే జులై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత మళ్లీ హరి హార విరమల్లు సినిమాకి ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే గతంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏపీలోనూ భారీగా ధరల పెంపు..

ఏపీలోలోనూ గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది.  

'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)