Breaking News

ఓటీటీలో అడ్వెంచర్ థ్రిల్లర్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Fri, 09/13/2024 - 12:40

కోలీవుడ్‌ డైరెక్టర్‌  R. పార్తిబన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఈ ఏడాది విడుదలైన సినిమా 'టీన్స్‌' (Teenz). కోలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. R. పార్తిబన్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'పుదియ పాదై' 1989, 'హౌస్‌ఫుల్‌' 1999 రెండు సినిమాలు జాతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డ్‌ సొంతం చేసుకున్నాయి. 2019లో విడుదలైన 'ఒత్త సెరుప్పు సైజు 7' చిత్రం కూడా జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకుంది. నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా అనేక ఛాలెంజింగ్ సినిమాలను అందించాడు.

అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఆర్‌. పార్తిబన్‌ టీన్స్‌ సినిమాను తెరకెక్కించారు. అందరూ యువ నటీనటులను ఎంపిక చేసుకుని ఆసక్తిగా కథను తెరపై చూపించాడు. భారతీయుడు-2 సినిమాతో పోటీగా జులై 12న  'టీన్స్‌' కూడా విడుదలైంది. మొదట థియేటర్స్‌ పెద్దగా దక్కలేదు. కానీ, సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్లతో పాటు గుర్తింపు తెచ్చుకుంది. అయితే, సెప్టెంబర్‌ 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో టీన్స్‌ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించగా యోగి బాబు అతిధి పాత్రలో కనిపించారు.

అడ్వెంచర్‌లా 'టీన్స్‌' కథ
8మంది టీనేజీ అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిల చుట్టూ టీన్స్‌ కథ తిరుగుతూ ఉంటుంది. ఓ రోజు క్లాస్‌కు వెళ్లకుండా వాళ్లు తీసుకున్న ఒకేఒక నిర్ణయం వారందరినీ ఊహించలేనంత ప్రమాదంలోకి పడేస్తుంది. తామందరం ధైర్యవంతులమని నిరూపించుకోవాలనే కోరికతో సుమారు 500 ఏళ్ల నాటి బావి వద్దకు ఎవరికీ చెప్పకుండా వెళ్తారు. అక్కడ దెయ్యాలు ఉంటాయని ప్రచారం ఉంటుంది. 

ఇదీ చదవండి:  కుమారుడి పుట్టినరోజు.. అజయ్- కాజోల్‌ స్పెషల్ విషెస్

అక్కడికి వెళ్లిన 13 మంది టీనేజ్‌ పిల్లలు ఎలాంటి ప్రమాదంలో పడ్డారు..? చివరగా ఎంతమంది బయటకు వచ్చారు..? అక్కడ వారందరికీ ఎదురైన ప్రమాదం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చాలా ఆసక్తిగా టీన్స్‌  సినిమాను ప్రేక్షకులకు చూపించారు పార్తిబన్‌.. అందుకే ఈ సినిమాకు 7.9 రేటింగ్‌ లభించింది. ఈ వీకెండ్‌లో మిమ్మల్ని మరో ప్రపంచంలోకి టీన్స్‌ సినిమా తీసుకెళ్తుంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)