Breaking News

కేరళకు అండగా తమిళ హీరోలు.. భారీ మొత్తంలో సాయం

Published on Thu, 08/01/2024 - 14:52

కేరళలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి అండగా కోలీవుడ్‌ హీరోలు నిలిచారు. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి పలు గ్రామాలపై పడటంతో సుమారు 200 మంది మరణించారు. అయితే, 250 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని అక్కడి ప్రభుత్వం తెలుపుతుంది. ముఖ్యంగా వయనాడ్, తిరువనంతపురం ప్రజలు తీరని నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసిన నేలకూలిన భవనాలు, బురదతో నిండిన వీధులు మాత్రమే కనిపిస్తున్నాయి.  కేరళలో ఇటువంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. అయితే, తాజాగా కోలీవుడ్‌ టాప్‌ హీరోలు ఇద్దరూ కేరళకు తమ వంతు అండగా నిలిచారు.

తమిళ స్టార్ చియాన్ విక్రమ్,  కేరళలో సంభవించిన విపత్తుపై ఉదారంగా స్పందించినందుకు అభిమానుల నుంచి విస్తృతంగా ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో జరిగిన విషాద సంఘటనలను చూసి చలించిన విక్రమ్ సహాయక చర్యల కోసం తన వంతుగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20 లక్షలు అందించారు. కేరళ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఆయన చాటుకున్నాడు.

దేశంలో ఎక్కడ విపత్తు వచ్చిన సాయం చేయడంలో ముందు ఉండే దంపతులు సూర్య- జ్యోతిక. తాజాగా వీరిద్దరూ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు ప్రకటించారు. సూర్య చేసిన సాయానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. కేరళలో ప్రస్థుత పరిస్థితిని చూస్తుంటే తనను ఎంతో  కలచి వేసిందని సూర్య తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సాయం చేస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో ప్రమాధానికి గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆశించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)