Breaking News

రణ్‌వీర్‌ సింగ్‌ విలన్‌గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?

Published on Mon, 09/22/2025 - 20:42

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్‌ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్‌గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హీరోయిన్‌ను మార్చేసిన మేకర్స్‌.. విలన్‌ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్‌ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్‌కు విక్రాంత్‌ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది.  పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్‌కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.

ఈ ఏడాది అజిత్ కుమార్‌ నటించిన గుడ్‌ బ్యాడ్ ‍అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్‌ దాస్‌ను విలన్‌గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్‌ యాక్టర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్‌తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.

arjun

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)