Breaking News

అంబానీ కుటుంబంతో నాకు పరిచయం లేదు: స్టార్ హీరోయిన్

Published on Sun, 07/14/2024 - 18:42

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో ‍గ్రాండ్‌గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్‌ కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.

అయితే కొందరు సినీతారలు ఈ పెళ్లి దూరంగా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఒకరు. తాజా ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలను వెల్లడించింది. తనకు అంబానీ కుటుంబంతో ఎలాంటి రిలేషన్‌ లేదని తాప్సీ తెలిపింది. ఎవరి పెళ్లికైనా ‍అతిథులతో కమ్యూనికేషన్ ఉంటేనే వెళ్లేందుకు ఇష్టపడతానని ఆమె పేర్కొంది. నాకు వ్యక్తిగతంగా వారితో ఎలాంటి పరిచయం లేదన్నారు. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమని తాప్సీ వెల్లడించింది. కాగా.. తాప్సీతో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరు కాలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)